ప్రతి పల్లెలో ఎన్నికలంటే నువ్వా.. నేనా అన్నట్లు పోటీ నెలకొంటుంది. కానీ ఆ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఓటేసే అవసరం లేకుండా ఐదు దఫాలుగా ఏకగ్రీవమ వుతూ వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య స్వగ్రామం టేకు లగూడెం ప్రత్యేకత ఇది. ఉమ్మడి ఉసిరికాయలపల్లి పంచాయతీ నుంచి 1999లో విడిపోయి ప్రత్యేక పంచాయతీగా టేకులగూడెం ఏర్పడింది. ఇక్కడ 614 మంది ఓటర్లుండగా.. అత్యధికులు సీపీఐ (ఎంఎల్- ప్రజాపంథా) సానుభూతిపరులే. నర్సయ్య నేతృత్వంలో ఆ పల్లె ప్రశాంత వాతావర ణంలో కలిసికట్టుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పాతికేళ్లుగా ప్రతి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమ వుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచి స్థానానికి గుమ్మడి సందీప్ (35), 8 మంది వార్డుల సభ్యు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విద్యార్థి దశ నుంచి పీడీఎస్యూలో చురుకుగా వ్యవహరించిన సందీప్ 2012లో సీపీఐ ఎంఎల్ పార్టీలో చేశారు.

