Headlinesబిజెపి నూతన సర్పంచ్ లకు ఘన సన్మానం

బిజెపి నూతన సర్పంచ్ లకు ఘన సన్మానం

Link Copied!

ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం రాయగిరి లోని లింగబసవా గార్డెన్ లో జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన సర్పంచులను రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఘనంగా సర్పంచులను సన్మానించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ

యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి బలం పెరిగిందని యాదాద్రి జిల్లాలో నాలుగు సర్పంచులు 20 ఉపసర్పంచులు వెయ్యి వార్డులు గెలిచామని అలాగే రాష్ట్రంలో 900 సర్పంచులు 1200 ఉపసర్పంచులు 10000 మంది వార్డు నెంబర్లతో గ్రామాలలో సత్తా చాటామని రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు అన్నారు.

గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో విధాలుగా నిధులు సమకూరుస్తూ గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుండాలని గ్రామాల అభివృద్ధి చెందితేనే పట్టణాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుచూపుతో గ్రామాలకు నిధులు విడుదల చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి మలేశం, పొత్తంశెట్టి రవీందర్, పడల శ్రీనివాస్ , వట్టిపల్లి శ్రీనివాస, జిల్లా ఇన్చార్జ్ శ్రీ వర్ధన్ రెడ్డి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles