సర్పంచ్ బాధ్యతలు
సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు, మార్గదర్శి. గ్రామ బాగోగులు చూడటంలో అతనికి ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సహకరిస్తారు. సర్పంచ్ బాధ్యతలు ఏమిటంటే:
– ప్రజాప్రయోజనాల దృష్ట్యా గ్రామంలో ఏ పనినైనా వెంటనే చేపట్టే అధికారం ఉంటుంది.
– పంచాయతీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, పంచాయతీ రోడ్లు, కల్వర్టులు నిర్వహణ.
– మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతులు, వీధులు శుభ్రం చేయించడం, వీధి దీపాల ఏర్పాటు, వాటి నిర్వహణ.
– పశువుల దొడ్ల ఏర్పాటు, ధర్మశాలలు, అతిథి గృహాల నిర్మాణం, నిర్వహణ.
– రహదారుల వెంట మొక్కల పెంపకం, విద్య, ఆరోగ్య, విద్యాభివృద్ధి, వైద్యశాల, ఆటస్థలాల నిర్వహణ.
– సామూహిక మరుగుదొడ్ల ఏర్పాటు, బావుల మరమ్మతులు, పూడికతీత, జనన, మరణాల నమోదు.
– వ్యాధుల నివారణకు చర్యలు, శ్మశానవాటికల నిర్వహణ, అనాథ శవాల దహన సంస్కారాలు.
సర్పంచ్ విధులు, అధికారాలపై పంచాయతీరాజ్ చట్టం స్పష్టంగా నిర్వచించింది. సర్పంచ్ ఈ బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా గ్రామ అభివృద్ధికి కృషి చేయాలి.
