నేటి తరానికి మరియు భావితరానికి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శ నాయకుడని ప్రముఖ సామాజికవేత్త ఆదిలీల ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శేర్లింగం కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ వీరబొమ్మ రమేష్ గుప్తా గారు తెలిపారు గురువారం 25 12 2025 అటల్ బిహారీ వాజ్పేయి పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవ సత్సంగ్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాదు నందు వాజ్పాయ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన సందర్భంగా వీరబొమ్మ రమేష్ గుప్తా గారు మాట్లాడుతూ నిజాయితీగల నాయకుడుగా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన ప్రధానిగా చరిత్రలో నిలిచిపోయారని ఇప్పుడు వస్తున్న నాయకులు వారిని ఆదర్శంగా తీసుకొని ఆదర్శ నాయకులుగా మెలగాలని సూచించారు వారు చేసిన సేవలకు గుర్తుగానే కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇచ్చిందని అది ఎంతో గర్వకారణం అని తెలిపారు ఆది లీల ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ వాజ్పేయి గారి పేరు మీద మంచి పథకం ఒకటి పెట్టి యువత కు చేయూత ఇచ్చి నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు కార్యక్రమంలో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కే బి శ్రీధర్ సామాజికవేత్త అజయ్ శ్రీనివాస్ శర్మ నవీన్ శంఖపాణి నాయుడు తదితరులు పాల్గొన్నారు
