Headlinesశ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు పొందిన వీరబొమ్మ రమేష్ గుప్తా

శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు పొందిన వీరబొమ్మ రమేష్ గుప్తా

Link Copied!

హైదరాబాదులో జరిగిన జిటిఏ కన్వెన్షన్ కార్యక్రమంలోకాంగ్రెస్ పార్టీ శేర్లింగంపల్లి అబ్జర్వర్ వీరబొమ్మ రమేష్ గుప్తా శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమం లో గ్లోబల్ ప్రెసిడెంట్ మల్లా రెడ్డి మరియు ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి లు వీరబొమ్మ రమేష్ గారిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా రమేష్ గుప్తా వారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు. వారి చేతులమీదుగా జ్యోతి ప్రజ్వ లను జిటిఏ ప్రోగ్రాం అఫీషియల్ గా ఇనాగరేషన్ చేశారు. ఈ సందర్బంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడుతూ..

జిటిఏ అనేది ఒక చారిటబుల్ సంస్థ. దాదాపుగా 100 దేశాలల్లో జిటిఏ కార్యక్రమాలు నడుస్తున్నాయి. జిటిఏ యొక్క ముఖ్య ఉద్దేశం పేదలను ఆదుకోవడం ఆరోగ్య సంరక్షణ ఎడ్యుకేషన్ మరియు ఇతర దేశాలలో ఉండే మన వాళ్లకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే ఆపద్బాంధవు అని కొనియాడారు.

మన జి టి ఏ. శ్రీ మల్లారెడ్డి గారు గ్లోబల్ ప్రెసిడెంట్ మరియు శ్రీ శ్రీనివాస రెడ్డి గారు ఇండియా ప్రెసిడెంట్ జిటిఏ ని చక్కగా ముందుకు తీసుకు వెళుతున్నారని తెలిపారు. ఎంతోమంది దాతల సహాయంతో ఈ సంస్థ ముందుకు సాగుతుంది అని అన్నారు.

తాజా వార్తలు

Related Articles