Headlinesమూడు బల్దియాలు 1,67,106 మంది ఓటర్లు...

మూడు బల్దియాలు 1,67,106 మంది ఓటర్లు…

Link Copied!

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది. గురువారం జిల్లాలోని నిర్మల్, బైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీలో ముసాయిదా ఓటరు జాబితాను ‘పుర’ అధికారులు విడుదల చేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీలో 1,67,106 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు ఈ నెల 4వ తేదీ వరకు ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ, ముసాయిదా ఓటరు జాబితా పై ఈనెల 5న మున్సిపల్ కార్యాలయాల్లో, 6న కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశం నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకొని మార్పులు, చేర్పులు చేస్తారు. ఈనెల 10 తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు.
అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి…
నిర్మల్ మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా కలెక్టరేట్, ఆర్డీవో, తహసిల్దార్, మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించామని, వీటిలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల విభాగం కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలని ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ల జాబితాలో తమ పేర్లు ఉండేలా చూసుకోవాలని కోరారు.
: జగదీశ్వర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్, నిర్మల్

తాజా వార్తలు

Related Articles