Headlinesకరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

Link Copied!

EC to launch first phase of all-India SIR next weekకరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ఓటర్ల జాబితా ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంతోపాటు ఆర్డీవో ,తహసిల్దార్ అర్బన్ కార్యాలయాల్లో ముసాయిదా జాబితా అందుబాటులో ఉంటుందని వారు వివరించారు.
జనవరి 4వ తేదీలోగా అభ్యంతరాలను స్వీకరించి ఐదవ తేదీన పోలింగ్ స్టేషన్లో ఓటర్ల జాబితా పై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. జనవరి 10వ తేదీన ఓటర్ల తుది జాబితాను ప్రకటించి, ఎన్నికల సంఘానికి అందజేస్తామని అధికారులు తెలిపారు.
ఆరు నెలల క్రితం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పునర్విభజన ప్రక్రియ చేపట్టి 60 డివిజన్ల నుంచి 66 డివిజన్లకు పెంచడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కు 4,500 మంది ఓటర్ల నుంచి 5, 990 మంది ఓటర్లను నిర్ణయించారు.

తాజా వార్తలు

Related Articles