Headlinesముదిరాజ్ సర్పంచ్ లకు ఘనంగా సన్మానం

ముదిరాజ్ సర్పంచ్ లకు ఘనంగా సన్మానం

Link Copied!

ది లీడర్స్ డైరీ, నారాయణపేట : ఆదివారం నాడు నారాయణపేట నియోజకవర్గం మరికల్ మండల పరిధిలో ని గ్రామాలలో ముదిరాజ్ సర్పంచులుగా, ఉప సర్పంచ్ లుగా మరియు వార్డు మెంబర్లు గా గెలిచిన ముదిరాజ్ బంధుమిత్రులని ఘనంగా శాలువాలతో సన్మానం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహబూబ్నగర్ డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

ముదిరాజులు రాబోయే రోజులలో రాజకీయం గా మరింత శక్తివంతంగా ఎదగాలని అన్నారు. సర్పంచులుగా ఉపసర్పంచులుగా వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి ముదిరాజ్ బంధువులకు వెన్నంటి ఎప్పుడు కుల సంఘం కుల బంధువులు ఎప్పటికీ మీకు సపోర్టుగా ఉంటారు అని ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమం లో నారాయణపేట మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కాంత్ కుమార్ శరత్ నాగరాజ్ జిల్లా అధ్యక్షులు జిల్లా ఇన్చార్జ్ పటేల్ శ్రీనివాసులు ఈదప్ప బాపనపల్లి శ్రీనివాసులు సర్పంచ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొనంగేరి హనుమంతు యాదగిరి ఎడిటర్ ఆశన్న గణేష్ నాగరాజు ఉస్మానియా యూనివర్సిటీ ఆంజనేయులు ముదిరాజ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles