Headlinesసంక్షేమ ఫలాలు పేదలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం - కొలను హన్మంతు రెడ్డి

సంక్షేమ ఫలాలు పేదలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం – కొలను హన్మంతు రెడ్డి

Link Copied!

ది లీడర్స్ డైరీ : నిజాంపేట్ డివిజన్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ప్రాంతంలో మంజుల ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర జాతీయ పౌర సరఫరాల పతాక దుకాణాన్ని (3307013) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలను హన్మంతు రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా హన్మంతు రెడ్డి మాట్లాడుతూ..

పేద ప్రజలకు నాణ్యమైన సన్న బియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ఆహార భద్రత కార్డు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని,ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందని, పేదల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కొలను రాజశేఖర్ రెడ్డి, కొలను జీవన్ రెడ్డి, ఆలేటి శ్రీనివాస్ రావు, మైసిగారి శ్రీనివాస్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, దాసరి మహేష్, కొలను సత్తి రెడ్డి, బాల బ్రహ్మచారి, శంకర్ ముదిరాజ్, అనిల్, వికాస్, జైపాల్, గోవర్ధన్, బబ్లు తదితరులు పాల్గొన్నారు…

తాజా వార్తలు

Related Articles