
ది లీడర్స్ డైరీ, కడ్తాల్ మండలం : సర్పంచుల సంఘం చైతన్య సదస్సును విజయవంతం చేయాలని సర్పంచ్ బొప్పిడి గోపాల్ పిలుపునిచ్చారు. శుక్రవారం కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో సర్పంచ్ బొప్పిడి గోపాల్ స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 10న జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల సర్పంచులతో, సర్పంచుల సంఘం జిల్లా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
నూతనంగా గెలుపొందిన సర్పంచులు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాలు అంగన్ వాడీ భవనాలు, కుల సంఘాల భవనాలు, విద్యాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్సన తదితర అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు పవన్ కుమార్, నాయకులు శేఖర్, ముబీన్, నరసింహ, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు..
