Headlinesఈనెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం చైతన్య సదస్సు -బాదేపల్లి సిద్ధార్థ

ఈనెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం చైతన్య సదస్సు -బాదేపల్లి సిద్ధార్థ

Link Copied!

చైతన్య సదస్సు.. తేవాలి ఉషస్సు..
ఈనెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం చైతన్య సదస్సు..
పార్టీలకు అతీతంగా అందరూ రావాలని పిలుపు..
తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ పిలుపు

ది లీడర్స్ డైరీ : సర్పంచులంతా ఒకే వేదిక మీదికి వచ్చి గ్రామీణ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించే దిశగా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి బాదేపల్లి సిద్ధార్థ పిలుపునిచ్చారు. ఇందుకోసం ఈనెల 10వ తేదీన రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం చైతన్య సదస్సు హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రజల అందరి సహకారంతో గ్రామాల సర్పంచులుగా ఎన్నికైన మనం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు, తాగునీరు తదితర సమస్యల పరిష్కారానికి నిధులు సమకూర్చుకునే విషయంలో ప్రభుత్వాలతో పోరాడవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీలకు అతీతంగా సంఘటితంగా పోరాడితేనే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. సర్పంచులందరినీ పార్టీలకతీతంగా ఒక వేదిక మీదకు తేవాలన్న ఉద్దేశంతో 1995లో వైబివి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఈ సంఘం ఏర్పడిందని గుర్తు చేశారు. ఇక తెలంగాణ ఆవిర్భవించాక సత్యనారాయణ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ గా ఇది అవతరించిందని వెల్లడించారు. ఛాంబర్ అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని సర్పంచి ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని కోరారు..

తాజా వార్తలు

Related Articles