.. పంచాయితీ రాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి..
చేవెళ్ల టౌన్, జనవరి 9 సర్పంచ్ల సంఘం చైతన్య సదస్సుకు సర్పంచులందరూ తరలి రావాలి పంచాయతీరాజ్ సాంబార్ రాష్ట్ర అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, సర్పంచ్ల సంఘం రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షుడు రెడ్డి శెట్టి మధుసూదన్ గుప్తా పిలుపునిచ్చారు. శుక్రవారం వారు చేవెళ్లలో విలేకరులతో మాట్లాడారు. శనివారం రంగారెడ్డి జెడ్పి కార్యాలయంలో పార్టీలకు అతీతంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. సర్పంచులందరూ అధిక సంఖ్యలో హాజరై ఈ సదస్సు విజయవంతం చేయాలని వారు కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు జిల్లా నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధిక నిధులు వెళ్తున్నాయని, జిల్లా అభివృద్ధి కోసం సర్పంచులను ప్రత్యేక నిధి కేటాయించాలని డిమాండ్ చేశారు. పార్టీలకతీతంగా సర్పంచులందరూ ఏకమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చట్టబద్ధంగా మనకు రావలసిన నిధులు, విధులు పోరాడే సంపాదించుకుందామన్నారు. అందరూ సంఘటితంగా ఏకమవుతూనే సమస్యలను పరిష్కరించుకోవచ్చునే ఉద్దేశంతో సర్పంచిగా సంఘాన్ని 1995 వై వి బి రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘంగా స్థాపించారని గుర్తు చేశారు. తెలంగాణలోనే తొలి సర్పంచుల సదస్సుగా నిర్వహించే సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు రామచంద్రయ్య, ప్రభాకర్ రెడ్డి, , మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ బండారి ఆగిరెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
