ది లీడర్స్ డైరీ : రంగారెడ్డి జిల్లా.. శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ..
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే రెండోసారి మొట్టమొదటిగా రాజస్థాన్ రెండో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మన తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో గతంలో 1959 నుంచి సర్పంచులకు ప్రత్యేక నిధులు,అధికారాలు, విధులు ఉండేవి.
కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2018 లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత గ్రామపంచాయతీలకు నేరుగా రావాల్సినటువంటి నిదులు, మైనింగ్ నిదులు కూడా రాష్ట్ర ఖజానాలోవేసుకొని,గ్రామపంచాయతీ వ్యవస్థ కేవలం సూపర్ వైజర్ ల వ్యవస్థ గా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం మార్చింది .
గతంలో చిన్న గ్రామపంచాయతీ ఉంటె మేజర్ గ్రామ పంచాయతీ ఉండేది. నిదులు ఉండేవి, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ట్రాక్టర్ కు డీజిల్ కు పైసలు,ఆ ట్రాక్టర్ డ్రైవర్ కు జీతం ఇచ్చే పరిస్థితి లేదు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో తెచ్చిన చట్టంతో గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంప్ డ్యూటీ, ఇసుక, గ్రావెల్, మైనింగ్ ద్వారా వచ్చిన నిధులను పంచాయతీలకు ఇవ్వకుండా రాష్ట్ర ఖజానాకు మళ్లించిందని, ఇది గ్రామీణ ప్రజలకు చేసిన అన్యాయమని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించి పంచాయతీ నిధులను తిరిగి పంచాయతీలకే ఇవ్వాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా నిధులు ఇస్తామని హామీ ఇచ్చారని, గ్రామాల అభివృద్ధి అవసరాల దృష్ట్యా ప్రతి పంచాయతీకి రూ.50 లక్షల రూపాయల నిధులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర జనాభాలో 80 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నందున, రాష్ట్ర బడ్జెట్ లో 50 శాతం నిధులు గ్రామాలకే కేటాయించాలన్నారు. కొత్తగా ఏర్పడిన పంచాయతీలకు నేటికీ సొంత భవనాలు లేవని, వాటికి వెంటనే స్థలం కేటాయించి, భవన నిర్మాణాలకు నిధులు విడుదల చేయాలని కోరారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులతో పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకుండా వేదించిందని, ఇప్పుడు అదే పార్టీ నేతలు పెండింగ్ బిల్లులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
గ్రామంలో ఉన్నటువంటి సర్పంచులు ఏవైతే అభివృద్ధి పనులు చేయించినారో ఆ నిధులను కూడా ఈరోజు వరకు విడుదల చేయలేదు. గౌరవ ముఖ్యమంత్రిని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్పంచులు కోరుకునేది ఏమిటంటే,గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పంచాయతీరాజ్ చట్టాన్ని, తిరిగి అమలు చేయాలి.
పంచాయతీరాజ్ చట్టంలో ఏవైతే మైనింగ్ స్టాంప్ డ్యూటీ చేస్తుండగా గతంలో ఏదైతే ఎమ్మెల్సీ లో ఓటు హక్కు కల్పించాలి. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో రంగారెడ్డి జిల్లా నుంచి ప్రభుత్వానికి అధికమైన నిదులు వస్తున్నాయి. అంటే పూర్తిగా రాష్ట్రాన్ని కాపాడుతుందంటే,రాష్ట్ర పరిపాలన జరుగుతుందంటే రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నటువంటి నిధులతో అభివృద్ధి జరుగుతుంది.
కాబట్టి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలలో సంబంధం లేకుండా 50 లక్షల రూపాయలను నేరుగా గ్రామపంచాయతీలకు కేటాయించాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు..
