Headlinesజనవరి 13 న స్వర్గీయ Dr. మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

జనవరి 13 న స్వర్గీయ Dr. మర్రి చెన్నారెడ్డి జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం

Link Copied!

ది లీడర్స్ డైరీ : జనవరి 13, 1919 వ సంవత్సరంలో జన్మించిన మర్రి చెన్నారెడ్డి 33 సంవత్సరాలకే మంత్రి అయ్యారు. పరిపాలన పై సంపూర్ణ అవగాహన, పూర్తి పట్టు ఉన్న మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఉన్నతాధికారులపై అదుపు, ప్రభుత్వ ఫైళ్ళపై అధికారులు చెప్పినట్టు సంతకం పెట్టకుండా, వాటిని క్షుణ్ణంగా చదివి,నోటింగులు రాసి మరీ సంతకం చేసి నిర్ణయం తీసుకునేవారు.

1969 – 70 సమయంలో తెలంగాణ ఉద్యమ సారధిగా ఆయన మొదటగా పరిచయమయ్యారు. తెలంగాణ తొలి దశ ఉద్యమానికి ముందు, తర్వాత పార్టీలో ముఖ్య నేతగా అనేక పదవులు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 6 వ ముఖ్యమంత్రిగా, రెండున్నర ఏళ్లు, పదేళ్ల తర్వాత ఏడాది పాటు అదే పదవి చేపట్టారు. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కన్నా, పలు రాష్ట్రాలకు గవర్నర్ గా ఎక్కువ కాలం పని చేశాడు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించి “తెలంగాణ ప్రజా సమితి” (TPS) పార్టీని తన అధ్యక్షతన నడిపించారు.1971 వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో 14 సీట్లకు గాను, 10 సీట్లను TPS కైవసం చేసు కోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఖంగుతింది.

1974 తర్వాత ఇందిరా గాంధీ పిలుపుమేరకు, మరి చెన్నారెడ్డి గవర్నర్ పదవి చేపట్టారు. పదేళ్ల తర్వాత తెలంగాణలోని మేడ్చల్ నుండి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ – ఐ మెజారిటీ సాధించడంతో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.

1989 లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధిష్టానం PCC అధ్యక్ష పదవి ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాడు. అదే సంవత్సరం డిసెంబర్ లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంవత్సరం తర్వాత, అసమ్మతి మంటలు కారణంగా మరి చెన్నారెడ్డి రాజీనామా చేశారు.

ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల రాజకీయాలకు దూరమై, అతను మరణించేంతవరకు ఇతర రాష్ట్రాల్లో గవర్నర్ గా పనిచేశాడు.

చివరగా…
తెలంగాణ ఉద్యమానికి దిశా నిర్దేశం, నాయకత్వ నైపుణ్యం, ప్రజలతో సన్నిహితంగా మమేకం కావడం వంటి ప్రత్యేకతలు Dr. మర్రి చెన్నారెడ్డిని అసాధారణ నేతగా నిలిపాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర అపురూపం. వర్తమాన తెలంగాణ విజయ గాధలో చెన్నారెడ్డి స్ఫూర్తి ప్రతిబింబిస్తుంది.

ఒక్కమాటలో చెప్పాలంటే స్వర్గీయ Dr. మర్రి చెన్నారెడ్డి లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు..

తాజా వార్తలు

Related Articles