Headlinesమేడారం సమ్మక్క- సారలమ్మ జాతర.. చరిత్ర..

మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర.. చరిత్ర..

Link Copied!

ఈ జాతర 900 సంవత్సరాల చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటిది. క్రీ. శ. 1260 నుంచి 1360 వరకు ఓరుగల్లును పాలించిన కాకతీయ వంశస్థులు ప్రతాపరుద్ర చక్రవర్తి పాలించినట్లు స్థల పురాణాలు తెలుపుతున్నాయి.

భూపాలపట్నం( నేటి భూపాల్ పల్లి) లో తెగల నాయకుడైన మహారాజు ఒక చిన్నారిని దత్తత తీసుకొని, ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టాదు.

కొన్ని సంవత్సరాల తర్వాత..
మేడారం ప్రాంతాన్ని కోయ (ఆదివాసి) రాజైన పగిడిద్దరాజు పాలించేవారు. ఇతను కాకతీయులకు సామంత రాజు.
అప్పటి కరీంనగరాన్ని పాలించిన మేడరాజుకు మేనల్లుడైన పగిడిద్దరాజుకు, సమ్మక్కతో వివాహం జరిపించారు. పగిడిద్దరాజు- సమ్మక్కలకు… సారాలమ్మ, నాగులమ్మ, జంపన్నలు ముగ్గురు సంతానం. పగిడిద్దరాజు మేడారంను పాలించే సమయంలో, ఆ ప్రాంతంలో తీవ్ర అనావృష్టి రావడంతో ప్రజలు పన్నులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చేసేది ఏమీ లేక పగిడిద్దరాజు, పన్నులు కట్టలేమని కాకతీయ రాజులకు తెలిపాడు. కోపంతో ప్రతాపరుద్ర చక్రవర్తి మేడారం ప్రజలపైకి సైనికులను పంపాడు. కాకతీయ సైన్యం ములుగు సమీపంలోని లక్నవరం సరస్సు వద్ద సైనిక స్థావరం ఏర్పాటు చేసుకొని మేడారం పై యుద్ధం ప్రకటించారు.

యుద్ధంలో పగిడిద్దరాజు, అతని కుమార్తెలు నాగులమ్మ, సారాలమ్మ, అల్లుడు గోవిందరాజులు కలిసి కాకతీయ సైన్యాన్ని నిలువరించి చివరి వరకు పోరాడి వారు వీరమరణం పొందారు. వారి మరణాన్ని జీర్ణించుకోలేక కొడుకు జంపన్న, సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి ఆ వాగు, జంపన్న వాగుగా ప్రసిద్ధికెక్కింది.

సమస్త కుటుంబాన్ని కోల్పోయిన సమ్మక్క, కోపద్రిక్తురాలై యుద్ధ రంగానికి వచ్చి కాకతీయ సైన్యంపై విరుచుకుపడింది. సైనికులు, సమ్మక్కకు ఎదురు పోయి యుద్ధం చేసే పరిస్థితి లేకపోవడంతో, ఓ సైనికుడు వెనకనుంచి బల్లెంతో పొడవడంతో సమ్మక్క, మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలుకల గుట్టకు వెళ్లి గుట్ట మలుపు తిరిగిన తర్వాత అదృశ్యం అయ్యింది. తర్వాత తప్పు తెలుసుకున్న ప్రతాపరుద్ర చక్రవర్తి, సమ్మక్కకు భక్తుడిగా మారాడు.

మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరిగే తీరు..

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసం (జనవరి- ఫిబ్రవరి) లో జరిగే ఈ జాతరకు, పది రోజుల ముందు నుండే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
సారాలమ్మను కన్నేపల్లి లోని గుడి వద్ద పూజించి, సమ్మక్క దేవత పూజారులైన సిద్ధబోయిన వారింటికి తీసుకువస్తారు.
సమ్మక్క పూజారులు చిలుకల గుట్ట వద్దకు వెళ్లి, దేవతను కుంకుమ భరణి రూపంలో తీసుకువస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం, అధికారిక లాంచనాలతో 10 రౌండ్లు తుపాకీ కాల్పులు జరిపి దేవతను గద్దెపైకి తీసుకువస్తారు.
చివరి రోజు పూజా కార్యక్రమాలు, జాతర ఉత్సవాల అనంతరం జాతర వనదేవతలు, తిరిగి వనంలోకి వెళ్తారు.

జాతర ప్రాముఖ్యత..

కుంభమేళ తర్వాత అత్యధికంగా భక్తులు పాల్గొనే పండుగ ఇది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసి జాతి తెగకు చెందినది మేడారం జాతర.
సమ్మక్క, సారాలమ్మ, జంపన్నలు వెదురుకర్రల రూపంలో పూజలు అందుకుంటారు.
భక్తులు, వనదేవతలకు బెల్లం ( బంగారం) ను కానుకగా సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు.
జాతరలో జంపన్న వాగులో పుణ్యం స్థానం చేస్తారు.వాగు ఎర్రగా ఉంటుందని, యుద్ధ సమయంలో మరణించిన జంపన్న రక్తపు మరకలని భక్తుల నమ్మకం.

ఆదివాసి కుంభమేళాకు వేళాయె ! …..ఈసారి జరిగే జాతరలో..

జనవరి 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనుంది.
జాతరకు 2 వారాల ముందు నుంచే ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలతో పూజా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
జనవరి 28 నుంచి వన దేవతలు ఒక్కొక్కరిగా గద్దెలపై చేరుకుంటారు.
దేవతలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు ప్రత్యేకnews పూజలతో గద్దెలపై కొలువు తీరుతారు.
ఈసారి జరిగే మేడారం జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే గాక, పొరుగు రాష్ట్రాల నుంచి మొత్తం 3 కోట్ల మంది భక్తులు మొక్కులు తీర్చుకుంటారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.

జనవరి 14 న గుడి మెలిగే పండుగ..
21 న మండమెలిగే పండుగ…
27 న పగిడిద్దరాజు,జంపన్నలు మేడారానికి పయనం…
28 న సారాలమ్మ, గోవిందరాజులు గద్దెలపైకి కొలువు..
29 న సమ్మక్క దేవత గద్యపై ప్రతిష్ట..
30 న వనదేవతలకు మొక్కుల సమర్పణ…
31 న తిరిగి వనంలోకి వనదేవతలు..

ఫిబ్రవరి 4 న తిరుగువారం పండుగతో జాతర ఉత్సవాలు ముగింపు..

చివరగా..

ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, వారి ఐక్యత, వీరత్వం ఈ జాతరలోని పూజా కార్యక్రమాలలో కనిపిస్తాయి..

తాజా వార్తలు

Related Articles