Headlinesనూతన సర్పంచులకు 19 నుంచి శిక్షణా తరగతులు ఆదేశాలు జారీ.

నూతన సర్పంచులకు 19 నుంచి శిక్షణా తరగతులు ఆదేశాలు జారీ.

Link Copied!

నూతన సర్పంచులకు 19 నుంచి శిక్షణా తరగతులు
ఆదేశాలు జారీ..
జనవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రంలో ఎన్నికైన కొత్త సర్పంచులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ (ట్ఘీఋట్) ఆధ్వర్యంలో జిల్లాల వారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు బుధవారం ఆదేశాలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2025 లో జరిగిన ఎన్నికలలో 12,702 గ్రామపంచాయతీలకు నూతనంగా సర్పంచులు ఎన్నికయ్యారు.ఇందులో 85 శాతం మంది కొత్తవారు ఉన్నారు.

కేంద్ర,రాష్ట్ర పథకాల్లో, నిధుల పంపిణీ నిబంధనల్లో మార్పులు వచ్చిన నేపద్యంలో… సర్పంచులందరికీ శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శిక్షణ, అవగాహన కోసం 253 మంది మాస్టర్ ట్రైనర్ లను ఎంపిక చేశారు. ఈ శిక్షణలో సర్పంచులు వారి అధికారాలు, విధులు,పాలన, ఆర్థిక నిర్వహణ, నిధులు, గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థ అమలుతో పాటు తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై మాస్టర్ లు అవగాహన కల్పించనున్నారు.

తాజా వార్తలు

Related Articles