
వీధి కుక్కలను చంపకుండా మంత్రి సీతక్క ఆదేశాలు జారీ
కొన్ని గ్రామ గ్రామాలలో వీధి కుక్కల పై విష ప్రయోగం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియ స్ గా తీసుకుందని, బా ధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా అన్ని గ్రామాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపారు.ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా కుక్కల సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురా వాలని సూచించారు. జరిగిన ఘటన పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వీధి కుక్కల తో సమస్య ఉందన్న నెపంతో అమానుషంగా కుక్కలను చంపడం చట్టవిరుద్ధం మాత్రమే కాదు, మానవత్వానికి పూర్తిగా విరుద్ధమన్నారు.
ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, మూగజీవాలను విషం పెట్టి చంపడం వంటి దారుణమైన చర్యలు పూర్తిగా నేరపూరి తమైనవన్నారు. వీధి కుక్కల నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా టీకాలు, కుటుంబ నియంత్రణ (స్టెరిలైజేషన్) వంటి శాస్త్రీయ పద్ధతు లను తప్పనిసరిగా అనుసరించాలని సీతక్క సూచించారు.
