
ఓటు హక్కు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి
అంతర్గాం తహసీల్దార్
దిలీడర్స్ డైరీ: ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాల నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవడం వారి బాధ్యతగా గుర్తించాలని అంతర్గం తహసీల్దార్ తూం రవీందర్ పటేల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విద్యార్థులతో ఒటర్ దినోత్సవ ర్యాలీ నిర్వహించి మాట్లాడారు.
మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛ, నిస్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతాయని అన్నారు. మతం జాతి కులం వర్గ భాషా లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీలో డిప్యూటీ తహసీల్దార్ మల్యాల తిరుపతి, సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ ఏ. సుమలత గిరిదా వార్లు, సడెంక శ్రీమాన్ సర్వేయర్ లలిత, ఎంపీ ఎస్ఓ మల్లేపల్లి శైలజ, ఆపరేటర్ పులి సతీష్, జి వేణు, జిపిఓ జిల్లా అధ్యక్షులు మర్రి శంకర్ స్వామి, జిపిఓలు వినోద , బి .పుష్పలత, పి. రాజ్ కుమార్, ఎన్ శ్రీనివాస్, కే పోచం జిల్లా పరిషత్ హెచ్ఎం, అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
