Headlinesముగిసిన శిక్షణా తరగతులు

ముగిసిన శిక్షణా తరగతులు

Link Copied!

శిక్షణ తరగతుల్లో కలెక్టర్ నుండి సర్టిఫికెట్ అందుకున్న పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్

ముగిసిన శిక్షణా తరగతులు

దిలీడర్స్ డైరీ: నూతనంగా గెలుపొందిన సర్పంచులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల (19 నుండి 23 వరకు) ఐదు రోజుల శిక్షణ తరగతుల శిబిరాన్ని మెదక్ జిల్లా కేంద్రంలోనీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. ఈశిక్షణ శిబిరంలో ఐదు రోజులుగా క్రమం తప్పకుండా హాజరై పంచాయతీరాజ్ జిల్లా అధికారులు వివరించిన గ్రామం యొక్క అభివృద్ధి, గ్రామంలో పారిశుద్ధ కార్యక్రమాలు, నిరక్షరాస్యతను నిర్మూలించడం, అక్షరాస్యతను పెంపొందించడం, పేదరిక నిర్మూలన,ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా గ్రామంలో అన్ని వర్గాల వారికి అవకాశాలు అంది పుచ్చడంలో వివిధ రకాల మౌలిక వసతులు వంటి విషయాలను చాలా క్షుణ్ణంగా వివరించారు.శుక్రవారం రోజు శిక్షణ శిబిరం ముగింపు సందర్భంగా శిక్షణలో భాగంగా జిల్లాకలెక్టర్ రాహుల్ రాజ్ నుండి సర్టిఫికెట్ అందుకున్న లింగంపేట పావని నరేందర్ గౌడ్ మాట్లాడుతూ ఈ శిక్షణలో చాలా చాలా తెలియనీ విషయాలు తెలుసుకుని వారి వారి అనుభవాలను సభాముఖంగా వెల్లడించినట్లు ఆమె పేర్కొన్నారు.

తాజా వార్తలు

Related Articles