
కుపాష్ పల్లి గ్రామపంచాయతీకి తమ భూమిని విరాళంగా ఇచ్చిన శ్రీ అలుగుబెల్లి రామచంద్రారెడ్డి గారు మరియు శ్రీ అలుగుబెల్లి మధుసూదన్ రెడ్డి గారు
నూతనంగా ఏర్పడిన కుపాశ్ పల్లి గ్రామపంచాయతీకి సొంత భవనం (గ్రామపంచాయతీ) నిర్మించడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో సర్పంచ్ పేరుమాళ్ల వేణుగోపాల్ గారి అర్జన మేరకు గౌరవనీయులు గ్రామ పెద్దలు శ్రీ అలుగుబెల్లి రామచంద్రారెడ్డి గారు మరియు శ్రీ అలుగుబెల్లి మధుసూదన్ రెడ్డి (మల్లారెడ్డి) గారు ముందుకు వచ్చి వారి యొక్క సొంత భూమిని గ్రామ సర్పంచ్ #పెరుమాళ్ళ వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో విరాళంగా ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ వారిని సన్మానించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మరియు గ్రామ పెద్దలు యువత అందరూ పాల్గొన్నారు.
