Headlinesఆదర్శ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Link Copied!

ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

 

ది లీడర్స్ డైరీ:ధర్మపురి, జనవరి 26:
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి లోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద ఆదర్శ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్గటూర్ ఎస్సై పి. ఉదయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూత్ సభ్యులు ఎస్సై ఉదయ్ కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు సంగ రమేష్ యాదవ్,
ఉప సర్పంచ్ మేరుగు జానీ,వార్డు సభ్యులు, యూత్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సామంతుల సాగర్, ఏదుల మణిదీప్ యాదవ్, యూత్ సభ్యులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles