రోడ్డెక్కిన రైతన్నలు .. గద్వాల ఐజ రహదారిపై ఐదు గంటలు కొనసాగిన నిరసన

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని బింగి దొడ్డి గ్రామ స్టేజీ వద్ద సీడ్ పత్తి రైతులు ( Cotton Seed Farmers ) రాస్తారోకో నిర్వహించారు. సుమారు వెయ్యి మంది రైతులు దాదాపు 5 గంటల పాటు రహదారిపై బైటాయించడంతో ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. నడిగడ్డ కుల పోరాట సమితి అధ్యక్షుడు గోంగొళ్ళ రంజిత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు, పల్లయ్య, చిన్న రాముడు, బీజేపీ నాయకులు రామచంద్రా రెడ్డి రైతులకు సంఘీభావం తెలిపి ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురవడంతో సీడ్ కంపెనీలు ( Seed Companys) , ఆర్గనైజర్లు ( Organisers ) కుమ్మక్కై రైతులకు మాయ మాటలు చెప్పి విత్తనాలను నాటించారని,  విత్తనాలు నాటి సుమారు 50 రోజులు అవుతున్న కంపెనీలు, ఆర్గనైజర్లు రైతులకు ఏ విషయం విత్తనాల కొనుగోలు ప్రస్తావన తీసుకురాక పోవడంపై మండిపడ్డారు.

Popular Doctors

0 out of 5

Mandula Samuel – మందుల సామేలు

$110
0 out of 5

బీర్ల ఐలయ్య – Beerla Ilaiah

$110
0 out of 5

బండారి లక్ష్మారెడ్డి – Bandari Lakshma Reddy

$110

Related Articles