మెదక్,డిసెంబరు11:మెదక్ జిల్లా,హవేలిఘనపూర్ మండల పరిధిలో లింగసాన్ పల్లి పోలింగ్ కేంద్రంలో నడవలేని స్థితిలో ఉన్న ఓవృద్ధురాలిని వీల్‌చైర్‌పై పోలింగ్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె ఓటు హక్కు వినియోగించేందుకు సహాయం చేసిన మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ రాధాకృష్ణ చేసిన పని స్థానిక ప్రజల ప్రశంసలను అందుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదన్న భావనతో,తన విధి పట్ల నిబద్ధతగా వ్యవహరించిన రాధాకృష్ణ పని ప్రజల్లో పోలీసులపై మంచి అభిప్రాయాన్ని పెంచింది. సాధారణంగా పోలీసులు కఠినంగా ఉంటారనే అభిప్రాయానికి భిన్నంగా, మానవత్వం,సేవా భావం కూడా వారిలో అంతర్లీనంగా ఉంటుందని ఈసంఘటన మరోసారి రుజువైంది.ప్రజల కోసం పోలీస్ శాఖ చేసే నిస్వార్థ సేవకు ఇది ఒక అందమైన ఉదాహరణగా నిలిచింది.
