స్థానిక సంస్థలు ఎన్నికల్లో కేవలం ఒక్క ఓటుతో ఆమెను గెలుపు వరించింది. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామమైన పరండోలి గ్రామపంచాయతీ సర్పంచ్ గా రాథోడ్ పుష్పలత కేవలం ఒక్క ఓటుతో ప్రత్యర్థి దిలీప్ కాటేపై గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి వెంకటస్వామి ప్రకటించారు. ఈ గ్రామపంచాయతీలో మొత్తం 873 ఓటర్లు ఉన్నారు ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు కాటే దిలీప్ కు 101 ఓట్లు రాగా, పుష్పలతకు 102 ఓట్లు పోలయ్యాయి దీంతో ఒక్క ఓటు తేడాతో ఆమెకు విజయం వరించింది.
పుష్పలత మాట్లాడుతూ పంచాయతీ అభివృద్ధికి తాను కృషి చేస్తానని తెలిపారు.
