
Mood Ganesh
ఆ పార్టీకి చెందిన మూడ్ గణేశ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. సాధారణ జీవితంనుంచి నాయకత్వ స్థాయికి సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన గణేశ్ గతంలో ఆటో డ్రైవర్‌గా, ప్రైవేట్ వాహన డ్రైవర్‌గా పనిచేశారు. అదే సమయంలో కార్మిక సమస్యలపై పోరాడుతూ ఆఈటూఛ్ డ్రైవర్ల యూనియన్‌లో చురుకుగా పనిచేశారు. అక్కడి నుంచి రాజకీయాల్లో ఎదిగి, కార్పొరేటర్‌గా గెలిచి ఇప్పుడు మేయర్ స్థాయికి చేరుకున్నారు. సాధారణ కార్యకర్త నుంచి నగర తొలి పౌరుడిగా ఎదిగిన మూడ్ గణేశ్ ప్రయాణం ఇప్పుడు రాజకీయాల్లో ఒక స్పూర్తిదాయకమైన ఉదంతంగా మారింది. ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను కాంగ్రెస్ 58 స్థానాల్లో పోటీచేసి పొత్తులో భాగంగా సీపీఎం కు రెండు స్థానాలు కేటాయించింది. ఇక సీపీఐ 57 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేసింది. బీఆర్‌ఎస్ 58, బీజేపీ 53, జనసేన 14, బీఎస్పీ 6, ఇతరులు 15, స్వతంత్రులు 91 మంది అభ్యర్థులు పోటీచేశారు. 60 స్థానాల్లో కాంగ్రెస్, సీపీఐ చెరో 22 స్థానాల్లో విజయం సాధించాయి. బీఆర్‌ఎస్ 8 స్థానాలకే పరిమితమయ్యింది. స్వతంత్రులు 6, బీజేపీ, సీపీఎం ఒక్కో స్థానంలో గెలిచాయి. తెలంగాణా లో గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ సిపిఐ పొత్తులో ఉన్నాయి. అయితే కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలకు పొత్తు కుదరలేదు. దాంతో విడివిడిగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత మేయర్ పదవికి సీపీఐ అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు బి.ఆర్.ఎస్. పార్టీ ముందుకు వచ్చింది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యంతో సిపిఐ కి కాంగ్రెస్ కు సయోధ్య కుదిరింది. ఆమేరకు సిపిఐ అభ్యర్థి మూడ్ గణేష్ మేయర్ గా ఎన్నికయ్యారు.
