సామల కృష్ణారెడ్డి విద్యార్థి దశ నుంచి ప్రజాసమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. మరెన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ ను సాధించాలన్న కోరికతో ఉద్యమం లోకి ప్రవేశించి యువతను, విద్యార్థులను ఉద్యమం దిశగా నడిపించారు. క్రమశిక్షణ గల సైనికుడిగా కృష్ణారెడ్డి తెలంగాణా కోసం కష్టాలను ,నష్టాలను తట్టుకుని పోరాటం చేశారు . ఆయన పోరాట చరిత్ర గురించి ఇపుడు తెలుసుకుందాం.
సామల కృష్ణారెడ్డి సంగారెడ్డి , సుగుణమ్మ దంపతులకు 1989 ఫిబ్రవరి 5 న మైలార్ దేవరంపల్లి, వికారాబాద్ జిల్లాలో జన్మించారు. కృష్ణారెడ్డి మైలార్ దేవరం పల్లి ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి పదివరకు ,ఇంటర్మీడియట్ వికారాబాద్ లోను చదువుకున్నారు. హైదరాబాద్ లోని నిజాం కాలేజ్ లో బిఏ పూర్తి చేసి ,ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చరిత్ర లో పోస్టు గ్రాడ్యుయేషన్ పట్టాపొందారు ….కృష్ణారెడ్డి తాతాగారు సామల వెంకటరెడ్డి 1965 సం.లోనే గ్రామ సర్పంచిగా పనిచేసారు.
అప్పట్లో ఎక్కడ చూసినా విద్యుత్ లేని పల్లెలు ఉండేవి. అప్పట్లో తమ గ్రామానికి వెలుగులు తీసుకురావాలనే సంకల్పంతో టేకు కట్టెలు వీదుల్లో పాతించి వీది దీపాలు ఏర్పాటు చేసారు. ఆరోజుల్లోనే ముందుచూపుతో చెక్ డ్యాం నిర్మాణాలు చేపట్టారు . ఈ చెక్ డ్యాoల నిర్మాణం ద్వారా ఆయా ప్రాంతాల భూగర్భ జలాల అభివృద్ధి, పశు పక్ష్యాదులకు త్రాగునీటి సదుపాయం, పర్యావరణ పరిరక్షణ కు కృషి చేశారు. ఇంకా పాఠశాల, పంచాయతీ భవనాలు నిర్మించి మంచి పేరు సంపాదించారని ఇప్పటికీ మైలార్ దేవరం పల్లి వృద్దులు యాదిచేసుకుంటారు.
వెంకటరెడ్డిగారు అప్పట్లో వందేమాతరం రాంచదర్ రావు నాయకత్వంలో జరిగిన నిజాం వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారుకృష్ణారెడ్డి తండ్రి గారు సంగారెడ్డి …వికారాబాద్ లోని చెన్నారెడ్డి నిర్మించిన SAP కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తిచేసాడు ,తర్వాత వ్యవసాయరంగం లోనే స్థిరపడ్డారు. అలా తాత గారి వారసత్వపటిమ అందిపుచ్చుకున్న సామల కృష్ణారెడ్డి కళాశాలనుంచే నాయకత్వ లక్షణాలతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
ఉద్యమాలగడ్డ నిజాం కాలేజ్ లో టిఆర్ యస్వి లో పనిచేసారు ….ఆ సమయంలోనే ఉద్యమం ఉదృత స్థాయికి చేరుకుంది. తన స్వంత ప్రాంతం వికారాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాయిలో విద్యార్థి ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన TSJAC అద్యక్షులు శుభప్రద్ పటేల్ అనుచరుడిగా 2009 నుంచి 14 వరకు కొనసాగారు. ఆ తర్వాత వికారాబాద్ స్టూడెంట్ జేఏసి ఉపాద్యక్షులుగా … ఉమ్మడి రంగారెడ్డి ప్రధానకార్యదర్శి గా బాద్యతలు స్వీకరించి ఉద్యమంలో బాగస్వామి అయ్యారు.
విద్యార్థి జేఎసి ఆద్వర్యంలో జరిగిన హోంమంత్రి ఇంటి ముట్టడి,అసెంబ్లీ ముట్టడి తదితర కార్యక్రమాలో పాల్గొని విజయవంతం చేసారుఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలోనే జేఏసి ఆద్వరంలో వికారాబాద్ లో ఖలేజా సినిమా షూటింగ్ అడ్డుకున్నారు . సెట్టింగులను ద్వంసం చేసారు. శుభప్రద్ నేతృత్వంలో ఓయు నుంచి రంగారెడ్డి జిల్లా వరకు జరిగిన 5 రోజుల బస్సుయాత్రలో పాల్గొని గ్రామాల్లో ప్రజలను, యువకులను చైతన్య పరిచారు. వారందరిని ఉద్యమం వైపు మళ్లించారు. 2011 లో నాగర్ కర్నూలు ఉప ఎన్నిక లో పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేసారు. Tsjac ఆద్వర్యంలో విద్యార్థుల పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నిరవదిక నిరహాదీక్షలు చేసారు.
పార్టీ ఆదేశాలమేరకు వంటా వార్పూ … మానవ హారం .. ధూమ్ ధామ్ … ఉద్యమ బస్ యాత్ర ,రహదారుల దిగ్భందనం ,రిలే దీక్షలు ,విద్యావంతుల సదస్సులు , మిలియన్ మార్చ్ ,సకల జనుల సమ్మె, తెలంగాణ మార్చ్ ,,సకల జనుల భేరి వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతం గా నిర్వహించారు. వేలాది మంది ప్రజలు పాల్గొనేలా చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గోన్నందుకు పోలీసులు కేసులు కూడా బనాయించారు.
2013 లో జరిగిన సడక్ బంద్ పొగ్రాం లో ఒకరోజు ముందుగానే శంశాబాద్ పాల్మాకుల చేరుకుని ఇప్పటి మంత్రి హరీష్ రావు సారధ్యంలో ఆ గ్రామ ప్రజలందరు పాల్గొనేలా చేశారు. ఈసందర్భంగానే కృష్ణారెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 2014లో తెలంగాణ వచ్చే వరకు జేఏసీ నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోకృష్ణారెడ్డి పాల్గొన్నారు 2014 ఎన్నికల్లో తెరాస తరపున ప్రచారంకూడా చేపట్టారు. 2016 వరకు పార్టీలోనే కొనసాగి ఆ తర్వాత పార్టీని వీడారు.
ఆ తర్వాత అగ్రవర్ణాల పేదల హక్కుల కోసం రెడ్డి జాగృతి సంస్థ ను స్థాపించారు. అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్లొన్నారు రైతుల హక్కుల సాధన కోసం రైతురాజ్యం సంస్ద తరపున జిల్లా బాద్యునిగా పని చేశారు . అలాగే 2018 నవంబర్ లో 2000 మంది రైతులతో రైతుమహా సమ్మేళనం నిర్వహించారు. రాజకీయ,సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ ప్రజల తరపున ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు.