రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు చెక్ పవర్ ఉండేది. అయితే 2018లో సర్పంచ్, ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పిస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. తాజాగా దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసి గతంలో మాదిరే పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌కు చెక్ పవర్ కల్పించింది.
