ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దుపై కొంత గందరగోళం నెలకొంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి/MPDO, సర్పంచ్/MPP డిజిటల్ సంతకాలతో పేమెంట్స్ జరుగుతాయని పేర్కొంది. అయితే అధికారుల, మీడియా గ్రూపుల్లో ఇది ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దుగా ప్రచారమైంది. వాస్తవానికి ఉపసర్పంచ్ చెక్ పవర్ తొలగించలేదు.
