కొత్త పంచాయితీలకు సొంత భవనాలు లేవ
న్యూస్ టుడే: కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం గతంలో గ్రామ పంచాయితీలకు అనుబంధంగా ఉంటున్న గిరిజన తండాలు ప్రత్యేక పంచాయితీలుగా మారాయి. కొత్తగా ఏర్పడిన వాటిలో కొన్నింటికి మాత్రమే సొంత భవనాలు అప్పట్లో మంజూరు అయ్యాయి. మిగిలిన గ్రామాల్లో అరకొర వసతుల మధ్య అద్దె గదుల్లో, కమ్యూనిటీ భవనాలు, పాఠశాల గదులు, రైతు వేదికల్లో పాలన కొనసాగిస్తున్నారు.
పాన్గల్ మండలంలోని షాగాపూర్ తండా పంచాయితీకి సొంత భవనం లేక చిన్నపాటి అద్దె గదిలో కొనసాగిస్తున్నారు. గదిలో స్థలం చాలా ఇటీవల కొత్త పాలకవర్గం ఆరుబయట సమావేశమైంది. సొంత భవనం మంజూరయ్యే వరకు ఇలాంటి సమావేశాలు నిర్వహించగా తప్పేలా లేవు.
చిన్నంబావి మండలం దగడపల్లిలో చేపట్టిన పనులు పిల్లర్ల వరకే పరిమితమయ్యాయి .పనులు అసంపూర్తిగా మిగిలిపోవడంతో రైతు వేదిక నుంచి పాలన సాగిస్తున్నారు. అమ్మాయి పల్లి, చిన్నంబావిలో, రైతు సంఘం అద్దె భవనంలో నిర్వాహన కొనసాగుతోంది.
*ప్రభుత్వం ఆదేశిస్తే ప్రతిపాదనలు
సొంత భవనాలు లేని కొత్త పంచాయతీల ప్రతిపాదనలు కావాలని ప్రభుత్వం ఆదేశిస్తే పంపిస్తాం. ఇప్పటికీ కొత్తగా ఏర్పడిన పంచాయితీల్లో నిధులు మంజూరైన వాటి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి.
