గ్రామపంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లు కలగకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన చాంబర్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నామినేషన్ల అప్పిళ్లకు సంబంధించి వివరాలను, మూడు దశల్లో కలిపి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు దాఖలైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనన్ని బ్యాలెట్ పేపర్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులకు సమాచారం అందివ్వడంలో తోడ్పాటు అందించాలన్నారు. ఎన్నికల కేంద్రాలకు చేరుకోవడానికి అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే అధికారులు అందరికీ గుర్తింపు కార్డులను ఇవ్వాలని చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, డిపిఓ శ్రీనివాస్, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో శంకర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
