ది లీడర్స్ డైరీ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సర్పంచులపై జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఛాంబర్ ప్రతినిధులు శనివారం, గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పై ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా చింపుల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ…
గ్రామాలకు నిధులు ఇవ్వనని, రాజకీయంగా ఎదగనివ్వనని, సర్పంచులను చంపేస్తానని ఎమ్మెల్యే బెదిరించడం అత్యంత హేయమని, పంచాయతీలకు ఇచ్చే నిధులు ఎమ్మెల్యే సొంత డబ్బు కాదని, ఆయన తీరు దొరల అహంకారాన్ని తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సర్పంచుల మనోభావాలు దెబ్బ తినేలా ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారని, తక్షణమే విచారణ జరిపి అనిరుద్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను, సత్యనారాయణ రెడ్డి కోరారు.
