Headlinesపల్లె పోరులో కాంగ్రెస్ జోరు

పల్లె పోరులో కాంగ్రెస్ జోరు

Link Copied!

ఫస్ట్ ఫేస్ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ హవ

కాంగ్రెస్ మద్దతుదారులు 2,198 , బి ఆర్ ఎస్ 1,123, బిజెపి 175, ఇండిపెండెంట్ లు 401, *  అత్యధికంగా నల్గొండలో 198 స్థానాల్లో కాంగ్రెస్ మద్దతు దారుల విజయం 

తొలి తిడుతా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందగా, టిఆర్ఎస్ రెండవ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఫేస్ లో భాగంగా గురువారం 3,834 ఉదయం ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. ఆ వెంటనే అధికారులు కౌంటింగ్ ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల పలుచోట్ల అర్థరాత్రి దాకా ఓట్ల లెక్కింపు కొనసాగింది. మొత్తం 3, 834 సర్పంచ్ స్థానాలను 12,960 మంది, 27,628 వార్డులకు 65, 455 మంది బరిలో నిలిచారు. అర్ధరాత్రి 12 గంటల వరకు 3, 510 గ్రామాల్లో ఫలితాలు ప్రకటించగా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2, 198 మంది సర్పంచులుగా గెలుపొందారు 1, 123 స్థానాల్లో టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు. 175 స్థానాల్లో బిజెపి బిజెపి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మరో 401 గ్రామాలను ఇండిపెండెంట్లు కైవసం చేసుకున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో కాంగ్రెస్ తిరుగులేని ఆదిపత్యాన్ని ప్రదర్శించింది. అత్యధికంగా నల్గొండ జిల్లాల్లో 198 గ్రామాల్లో అధికార పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు. ఆ తరువాత వికారాబాద్ లో 177, ఖమ్మంలో 136 గ్రామాల్లో గెలుపొందారు. మెదక్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగింది.
* కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అభివృద్ధి, సంక్షేమం*
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతుంది. సరిగ్గా ఇదే సమయంలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులే బాటలు వేసాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అంటున్నారు. ముఖ్యంగా అర్హులకు కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు లాంటి ప్రజా సంక్షేమ పథకాలు కాంగ్రెస్ కు కలిసొచ్చాయని పేర్కొంటున్నారు. వడ్డీ లేని రుణాలు, ఫ్రీ బస్ జర్నీ, ఇతర పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ వైపు మహిళలు ముగ్గు చూపినట్టు స్పష్టం అవుతోందని చెప్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సమన్వయంతో పని చేయడం వల్లే పార్టీకి ఈ స్థాయి విజయం దక్కిందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కాంగ్రెస్ జోరు కొనసాగింది. బి ఆర్ ఎస్ కు కంచు కోటగా భావించే సిద్దిపేటలో మాత్రం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. గురువారం అర్ధరాత్రి వరకు అందిన ఫలితాలను బట్టి సిద్దిపేట జిల్లాలో 63 సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతు దారులు గెలుచుకోగా, టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 64 చోట్ల గెలుపొందారు. అంటే కాంగ్రెస్తో పోలిస్తే ఈ జిల్లాల్లో కేవలం ఒక సర్పంచ్ స్థానాన్ని మాత్రమే టిఆర్ఎస్ ఎక్కువ సాధించింది. ఇకపోతే రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో మాత్రమే కాంగ్రెస్కు టిఆర్ఎస్ పోటీ ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 88 చోట్ల గెలుపొందగా, టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 66 చోట్ల.. వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ మద్దతుదారులు 177 చోట్ల గెలుపొందగా , టిఆర్ఎస్ మద్దతుదారులు 72 చోట్ల విజయం సాధించారు. ఈ జిల్లాలను మినహాయిస్తే మరే ఇతర జిల్లాల్లోనూ అధికార పార్టీ హవాను విఆర్ఎస్ అడ్డుకోలేకపోయింది. ఇక బిజెపి కేవలం 175 సర్పంచ్ స్థానాలతో సరిపెట్టుకుంది. కరీంనగర్, నిజామాబాద్, నిర్మల్ వంటి జిల్లాల్లో మినహా మిగిలిన చోట్ల సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. ఖమ్మం, ములుగు, పెద్దపల్లి, మెదక్ తదితర జిల్లాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ఖాతా కూడా తెరవలేదు. కాగా, దాదాపు 451 స్థానాల్లో ఇతరులు, అభ్యర్థులు విజయం సాధించారు.

తాజా వార్తలు

Related Articles