Headlinesపుర ఎన్నికల సందడి షురూ...

పుర ఎన్నికల సందడి షురూ…

Link Copied!

ఓటరు జాబితా రూపొందిస్తున్న అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం పురపాలికల ఎన్నికలకు సిద్ధమవుతుండడంతో హడావుడి కనిపిస్తోంది. ఓటర్ జాబితాను వార్డుల వారీగా ఖరారు చేయాలని ముసాయిదా హోటళ్ల జాబితాను జనవరి 10న ప్రకటించాలని ఎన్నికల సంఘం పేర్కొంది దీంతో బల్దియా యంత్రాంగం వార్డుల వారీగా జాబితాను సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. బుధవారం నుంచి వార్డు అధికారులు వార్డుల వారీగా ఓటరు జాబితాను రూపొందిస్తున్నారు.

ఇంటి నెంబర్ల ఆధారంగా

ఇంటి నెంబర్ల ఆధారంగా అధికారులు వార్డుల వారీగా ఓటర్ జాబితాలను ఖరారు చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేసి తుది జాబితాను ప్రదర్శించేలా చర్యలు చేపడుతున్నారు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో జాబితా రూపకల్పనపై ఆరా తీశారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా జాబితాను పకడ్బందీగా రూపొందించాలని సిబ్బందికి సూచించారు.

ఆశావాహుల కసరత్తు

మున్సిపల్ ఎన్నికల బదిలీలు దిగి ఆశావాహుల్లో బరిలో దిగే ఆశావాహుల్లో సందడి మొదలైంది రిజర్వేషన్లు తమకు అనుకూలంగా వచ్చేలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీల ఆశావహులు ఈ దిశగా అంతర్గతంగా కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని ప్రచారంతో పాటు బల్దియ అధికారులు చేస్తున్న ఏర్పాట్లతో బరిలో నిలిచే అభ్యర్థులు దూకుడు ప్రారంభించనున్నారు.

తాజా వార్తలు

Related Articles