సంగారెడ్డి మునిసిపాలిటీ, జహీరా బాద్ , సదాశివపేట, జోగిపేట టౌన్, నారాయణఖేడ్, జిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు రూరల్, కోహిర్: పురపారికల్లో ఎన్నికల సందడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కమిషనర్లు పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రక్రియ చేపట్టారు. అన్నిచోట్ల సిబ్బంది సమావేశాలు నిర్వహించి
పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని సేకరించారు. ఎక్కడెక్కడ బూత్ లు ఉన్నాయి.. వాటిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులు ఆదేశించారు.
256 వార్డులు.. 353 కేంద్రాలు..
జిల్లాలోని 11 పురపాలక సంఘాల్లో 256 వార్డులు ఉన్నాయి. ఈ వార్డుల్లో ఎన్నికల నిర్వహణ కోసం 353 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. వీటిలో ఉన్న సౌకర్యాల గురించి ఆరా తీస్తున్నారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలనే పరిగణలోనికి తీసుకున్నారు. ఈ జాబితాను పురపాలక కార్యాలయాల్లో, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రెండు రోజుల్లో పంపిస్తారు. ఓటర్ల జాబితాపై కూడా కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం పురపాలికల్లోని ఓటర్ల జాబితాను పంపించాలని తహసిల్దార్ కార్యాలయాలకు సమాచారం ఇచ్చారు. జనవరి 1 న ఓటరు డ్రాఫ్ట్ జాబితాను ప్రకటిస్తారు
