Headlinesప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు

ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదు

Link Copied!

ది లీడర్స్ డైరీ: మర్రిగూడ, జనవాసాల మధ్య మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం వలన ప్రజలకు, వాహనదారులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నందున గ్రామ సర్పంచ్ వీరమళ్ల శిరీష లోకేష్ సూచనల మేరకు గ్రామ కార్యదర్శి 3 మద్యం దుకాణాల యజమానులకు నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ శిరీష లోకేష్ మాట్లాడుతూ మద్యం దుకాణాలు జనావాసాల మధ్య, రోడ్లకు అతి సమీపంలో ఏర్పాటు చేయడంతో పాటు సిట్టింగ్ ల్లో కూర్చున్న మందుబాబులు మద్యం తాగి ఖాళీ సీసాలను జనావాసాల్లోకి విసిరేస్తున్నారని అన్నారు.అంతే కాకుండా రోడ్డుకు అతి సమీపంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో నిరంతరం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.వాహనదారులకు గాని,బాటసారులకు గాని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగానే నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కలిసి తీర్మానం చేసి నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు.

తాజా వార్తలు

Related Articles