నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని దీనిపై తానే రంగంలోకి దిగుతానని కెసిఆర్ ఇటీవల ప్రకటించారు. దీంతో గవర్నమెంట్ అవే అంశాలపై ఈనెల 29 నుంచి అసెంబ్లీని సమావేశపరచాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభలో ప్రాజెక్టులు సహా కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతను హరీష్ రావు కేటీఆర్ జగదీశ్ రెడ్డి తలసానికి కేసీఆర్ అప్పగించారు రైతు సమస్యలపై ఎమ్మెల్యేలను రెడీ చేస్తున్నారు అయితే ఆయన సభకు వస్తారా లేదా అనేది సందిగ్ధంగా ఉంది.
