మున్సిపాలిటీ ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే రాజకీయ పార్టీలు, లిఖిత పూర్వకంగా నిర్ణీత గడువులోగా సమర్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. మంగళవారం ఐ డి ఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 01-10-2025 నాటికి ఓటరుగా నమోదు అయిన ప్రతి వ్యక్తిని ఎపిక్ కార్డులో పేర్కొన్న చిరునామా ఆధారంగా ఆయా డివిజన్లకు సంబంధించిన ఓటరు జాబితాలో చేర్చడం జరిగిందని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఈ నెల 9వ తేదీ వరకు స్వీకరించే అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించి, పరిష్కరించిన అనంతరం 10వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు
