Headlinesషాపల్లి గ్రామంలో బెల్టు షాపుల నిషేధం

షాపల్లి గ్రామంలో బెల్టు షాపుల నిషేధం

Link Copied!

షాపల్లి గ్రామంలో బెల్టు షాపుల నిషేధం

గ్రామ సభలో ఏకగ్రీవ తీర్మానం

ది లీడర్స్ డైరీ: నార్కట్ పల్లి  మండలంలోని షాపల్లి గ్రామం లో నేటి నుండి బెల్టు షాపులను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. గ్రామంలో అక్రమంగా నడుస్తున్న మద్యం బెల్టు షాపుల వల్ల యువత చెడు అలవాట్లకు లోనవుతున్నారనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్పంచ్ ఏర్పుల మంజుల స్వామి మరియు పాలకమండలి సభ్యులు తెలిపారు. గురువారం గ్రామ సభలో సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా బెల్టు షాపులను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించారు. ఇకపై గ్రామ పరిధిలో ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామ పెద్దలు, మహిళా సంఘాల ప్రతినిధులు ఈ తీర్మానాన్ని స్వాగతించారు. బెల్టు షాపుల కారణంగా కుటుంబాల్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని గ్రామ సభలో పిలుపునిచ్చారు. ఈ నిర్ణయంతో గ్రామంలో శాంతి భద్రతలు మెరుగుపడటంతో పాటు యువత మంచి మార్గంలో నడుస్తారని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles