Headlinesభద్రాద్రి కలెక్టర్ ఆగ్రహం

భద్రాద్రి కలెక్టర్ ఆగ్రహం

Link Copied!

కుళ్లిన కూరగాయలు.. భద్రాద్రి కలెక్టర్ ఆగ్రహం

ది లీడర్స్ డైరీ: పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని భద్రాద్రి కలెక్టర్ అంకిత్ హెచ్చరించారు. జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టోర్ రూమ్ను పరిశీలించగా, అక్కడ కుళ్లిన కూరగాయలు కనిపించడంతో కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తాజా వార్తలు

Related Articles