Headlinesనేటితో ప్రచారం బంద్

నేటితో ప్రచారం బంద్

Link Copied!

నేటితో ప్రచారం బంద్

ది లీదర్స్ డైరీ : రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడ నుంది. సాయంత్రం ఐదు గంటల కల్లా మైకులు మూగ బోనుండగా, ప్రచార రథాలు విశ్రాంతి తీసుకోనున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా.. ఏడు కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లు, 116 మునిసిపాలిటీల్లోని 2582 వార్డులు కలిపి మొత్తం 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించను న్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. రాష్ట్రంలో 121 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉండగా వాటిల్లో 7 కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీల పరిధిలో మాత్రమే ప్రస్తుతం ఎన్నికలు జరగనున్నాయి. జీహెచ్ఎం సీ, గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు మినహా కరీంన గర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్లగొండ కార్పొరేషన్లలో ఎన్ని కలు చేపడుతున్నారు. 121 మునిసిపాలిటీల్లోని నకిరేకల్, సిద్ధిపేట, కొత్తూరు., జడ్చర్ల, అచ్చంపేట పురపాలికలకు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 116 మునిసిపాలిటీలకు సంబంధించిన వార్డుస్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారం భించి, అనంతరం ఫలితాలను వెల్లడించను న్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేం దుకు 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయడంతోపాటు 8,203 పోలింగ్ కేంద్రాలను నిర్ణయించారు. ఎన్నికల సామగ్రి భద్రత కోసం 137 స్ట్రాంగ్ రూమ్లను, ఓట్ల లెక్కింపునకు 136 కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు.

తాజా వార్తలు

Related Articles