Headlinesగ్రామ అభివృద్ధికి సహకరించండి..

గ్రామ అభివృద్ధికి సహకరించండి..

Link Copied!

గ్రామ అభివృద్ధికి సహకరించండి..

ది లీడర్స్ డైరీ: నాంపల్లి మండలం రేవల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం యాదవ్ ను నాంపల్లి మండలం రేవల్లి గ్రామ సర్పంచ్ బట్టు శ్రీను నాగమణి యాదవ్ కోరారు. సర్పంచ్ అభ్యర్థనపై స్పందించిన ఎమ్మెల్సీ సత్యం త్వరలోనే గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ వంగూరి సాయిలు,కొండ్రెడ్డి యాదయ్య,మద్ది సత్తయ్య,వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles