
సిపిఐ అభ్యర్థులను గెలిపించాలి
43 వ డివిజన్ లో మద్దెల దినేష్ కు మద్దతు
ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం
ది లీదర్స్ డైరీ:రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కార్పొరేటర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న సిపిఐ నగర సమితి నాయకులకు కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి )ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, అర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు ప్రజలను, కార్మికుల ను కోరారు. శుక్రవారం గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ కార్పొరేషన్ లో 9వ డివిజన్ నుంచి రేణికుంట్ల నరేశ్ (ప్రీతం), 16 వ డివిజన్ నుంచి కడారి స్వరూప, 41 వ డివిజన్ నుంచి మార్కపూరి సూర్య, 47 వ డివిజన్ నుంచి కన్నెబోయిన కనకరాజు, అదేవిధంగా 43 వ డివిజన్ లో మద్దెల దినేష్ లు కార్పొరేటర్ అభ్యర్థులు గా పోటీ చేస్తున్న వీరి గెలుపు కోసం ఏఐటియుసి కృషి చేయడం జరుగుతుందని వారు అన్నారు. సిపిఐ పార్టీ మద్దతు తో 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఏఐటియుసి మద్దతు ఇవ్వడం వల్ల కోల్ బెల్ట్ ప్రాంతాల్లో పది మంది ఎమ్మెల్యేలు గెలిచారని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల 11 న జరిగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ అడిగిన స్థానాలు ఇవ్వకుండా అధికారం ఉన్నదనే ఆలోచన తో సిపిఐ, ఏఐటియుసి ని స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్తించక పోవడం విచారకరమని వారు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో సిపిఐ స్వంతంగా నాలుగు డివిజన్లలో పోటీ చేస్తుందని, ఈ తరుణంలో ఆయా డివిజన్లలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు అదేవిధంగా 43 వ డివిజన్ లో ప్రజలకు అండగా నిలబడుతున్న మద్దెల దినేష్ కు ఏఐటియుసి మద్దతు తెలుపుతుందని, కార్పొరేటర్ గా దినేష్ ను గెలిపించాలని ప్రజలను, కార్మికులను, సిపిఐ, ఏఐటియుసి నాయకులను, కార్యకర్తలను వారు కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను, నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ఎ గౌస్, నాయకులు చెప్యాల భాస్కర్, ఆకునూరి శంకర్, బి.వెంకటేశ్వర్లు, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, నాయిని శంకర్, దాసరి శ్రీనివాస్, ఎర్రగొల్ల చేరాలు, పర్లపెల్లి రామస్వామి, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
