ది లీడర్స్ డైరీ : మేడారం.. ములుగు జిల్లా.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క- సారలమ్మ జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క- సారలమ్మ జాతర గత 15 రోజుల నుంచే భక్తుల కోలాహలం తో కిటకిటలాడుతుంది.
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క- సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణం నుంచి కొన్ని కిలోమీటర్ల మేర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. రాష్ట్రం నుంచే కాక, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేస్తూ, ఆశీస్సులు తీసుకుంటున్నారు.
సోమవారం శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ సతీ సమేతంగా మేడారం సమ్మక్క- సారలమ్మ ను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ….
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లను చేయడం జరిగిందని, తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాకా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి అమ్మవార్ల ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అన్నారు.
