Headlinesపరీక్షల వేళ.. ధ్రువపత్రాలు తీసుకోండిలా!

పరీక్షల వేళ.. ధ్రువపత్రాలు తీసుకోండిలా!

Link Copied!

పరీక్షల వేళ.. ధ్రువపత్రాలు తీసుకోండిలా!

ది లీడర్స్ డైరీ:పది, ఇంటర్, డిగ్రీ వార్షిక పరీక్షలకు సమయం ఆసన్న మైంది. వీటితోపాటు ఆయా కోర్సుల్లో చేరేందుకు ప్రవేశ పరీక్షల తేదీలు విడుదలయ్యాయి. ఈ సమయంలో విద్యార్థు లకు వారి చదువులకు సంబంధించిన ప్రతి ఒక్క ధ్రువపత్రం అవసరమవుతుంది. సమయానికి పత్రాలు పొందాల్సి ఉంటుంది. ముఖ్యంగా కుల, ఆదాయ, నివాస ధ్రువపత్రాలు తప్పనిసరి. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్, జేఈఈ మెయిన్స్లో అర్హత సాధించినవారికి ఓబీసీ, నాన్ క్రిమి లేయర్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు కావాల్సి ఉంటుంది. వీటిని సరైన సమయంలో పొందగలిగితే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లేదంటే అవస్థలు పడాల్సి వస్తుంది.

పది, ఇంటర్ విద్యార్థులకు..

పదో తరగతి విద్యార్థులు ముఖ్యంగా ఇంటర్లో చేరేం దుకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదువుకున్నట్లు స్టడీ సర్టిఫికెట్లు తీసుకోవాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మీసేవ కేంద్రాల ద్వారా పొందాల్సి ఉంటుంది..

వాటికోసం విద్యార్థి ఆధార్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి. లేదంటే అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. గతంలో తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం ఉంటే నిమిషాల్లోనే కొత్తది పొందవచ్చు.

ఏదైనా తరగతి చదవకుండా ఉండి సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ రోజులైతే విద్యార్థులు గ్యాప్ సర్టిఫికెట్ అవసరమవుతుంది. దీనికోసం మీసేవలో మొదటగా చది విన తరగతులకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్లు సమ ర్పించాలి. గ్యాప్ ఉన్న సంవత్సరం తెలియజేస్తూ నోటరీ ధ్రువీకరణ అఫిడవిట్ జతచేసి తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేయాల్సి ఉంటుంది.

జేఈఈ విద్యార్థులకు ఈ ధ్రువపత్రాలు అవసరమవుతాయి. వీటిని పొందేందుకు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలి. కుల ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, పదో తరగతి మార్కుల ధ్రువపత్రం, ఒకవేళ భూమి ఉంటే భూమి పత్రాల నకలు, తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు అయితే వారి వేతనానికి సంబంధించిన పత్రం, అఫిడవిట్ జతచేసి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే పత్రాలు ఇస్తారు

తాజా వార్తలు

Related Articles