Headlinesఅబ్దుల్లాపూర్ మెట్ మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

Link Copied!

 

అబ్దుల్లాపూర్ మెట్ మండల సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

ది లీడర్స్ డైరీ: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల నూతన సర్పంచుల సమావేశం ఏర్పాటు చేసుకుని అన్ని గ్రామాల సర్పంచుల సమక్షంలో ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ని ఎన్నుకున్నారు.

అధ్యక్షులుగా జక్క రవీందర్ రెడ్డి (గండిచెరువు), ప్రధాన కార్యదర్శిగా కందికంటి విజయ్ కుమార్ (బండరావిరాల), ఉపాధ్యక్షులుగా ఉప్పు మాధవి-నవీన్ కుమార్ (బలిజగూడ), కోట ప్రభాకర్ రెడ్డి (పిగ్లీపూర్) రాచపాక నవనీత -మహేశ్ (అనాజ్‌పూర్ ), కోశాధికారిగా ఎర్రవల్లి గౌరీశంకరాచారి (బాటసింగారం)లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నుకొన్న కార్యవర్గం తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు మందుగుల విజయ-శ్రీశైలం గౌడ్ (అబ్దుల్లాపూర్ మెట్), పబ్బతి బాలకిషన్ గౌడ్ (చిన్నరావిరాల), కోలన్ లక్ష్మీప్రసన్న -రవీందర్ రెడ్డి (కవాడిపల్లి ), దేశారం రాఘవేందర్ గౌడ్ (ఇనాంగూడ), అంతటి హేమలత-జంగయ్య గౌడ్ (గుంతపల్లి) , ఎర్ర వెంకటేష్ యాదవ్ (జాఫర్ గూడ ), మేడిపల్లి ప్రియ-చంద్ర శేఖర్ గౌడ్ (మజీద్ పూర్), అల్లి ఐలయ్య యాదవ్ (లష్కర్ గూడ) తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

Related Articles