Headlinesమహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

Link Copied!


భద్రాద్రి కొత్తగూడెం.. పాల్వంచ రూరల్, గ్రామపంచాయతీ వ్యవహారాల్లో మీ భర్త జోక్యం చేసుకుంటున్నారంటూ కార్యదర్శి గత మూడు నెలలుగా వేధిస్తున్నాడని ఓ మహిళ సర్పంచ్ మనస్థాపం చెందిందని, అందుకే నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు ఎక్కించిందని ఆరోపణలు వెల్లువెత్తిన ఘటన భద్రాద్రి జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం…. భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం సత్యనారాయణపురం (మొండి కట్ట) మహిళ సర్పంచ్ జరుపుల సంధ్య ఆధ్వర్యంలో గ్రామంలో రోజు వివిధ పనులు జరుగుతున్నాయి. అయితే, ఈ పనుల్లో ఆమె భర్త జోక్యం చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పంచాయతీ కార్యదర్శి బాబా కొద్ది గత నెలలుగా సర్పంచి దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో మనస్థాపన చెందిన ఆ మహిళా సర్పంచ్… సోమవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె భర్త సంపంగి నవీన్ గమనించి చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాడు, ప్రస్తుతం చికిత్స పొందుతోంది.

విషయం తెలుసుకున్న పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్, ఎంపీడీవో కార్యాలయ అధికారులు వెంటనే ఆసుపత్రికి వెళ్లి మహిళా సర్పంచును పరామర్శించి వివరాలు తీసుకున్నారు. తన భార్య ఆత్మహత్యాయత్నంపై సర్పంచ్ భర్త నవీన్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, సత్యనారాయణపురం పంచాయితీ కార్యదర్శి సయ్యద్ బాబాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని ఎంపీడీవో నారాయణ తెలిపారు. ప్రస్తుతం సదర్ మహిళా సర్పంచ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఎంపీడీవో కార్యాలయ అధికారులు వివరించారు.

తాజా వార్తలు

Related Articles