
మాదారం గ్రామంలో ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన
ఎం.వి.ఎస్ డిగ్రీ కళాశాల మహబూబ్‌నగర్ రాజనీతి ఆర్థిక ఆర్థిక శాస్త్ర విభాగం అధిపతి హెచ్ ఓ డి ప్రొఫెసర్ మల్లికార్జున్ గారి ఆధ్వర్యంలో డిగ్రీ విద్యార్థులు ఒకరోజు క్షేత్ర పర్యటనలో భాగంగా మాదారం గ్రామాన్ని సందర్శించి గ్రామపంచాయతీ యొక్క విధులు, సర్పంచ్ బాధ్యతలు, గ్రామపంచాయతీ నిధులు, మరియు గ్రామ సెక్రటరీ యొక్క విధులు, గ్రామసభలు ఎలా నిర్వహిస్తారు ,అదేవిధంగా గ్రామ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశాల పైన గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శులను గ్రామపంచాయతీ కార్యాలయంలో కలిసి అనేక ప్రశ్నలు వేసి వివరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి క్షేత్రస్థాయిలో పరిశీలించి తెలుసుకున్నారు. అనంతరం శ్రీ రాకమకొండ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు గ్రామ సభలు, గ్రామపంచాయతీ విధులు, నిధులు అనే అంశాల గురించి పూర్తి స్థాయిలో వివరించడం జరిగిందని అదేవిధంగా విద్యార్థులు భవిష్యత్తులో మంచి రాజకీయ నాయకులుగా మరియు వివిధ హోదాలలో స్థిరపడాలని ఆకాంక్షించారు. కళాశాల అధ్యాపక బృందం గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వెంకటేష్, ఉపసర్పంచ్ మంజుల వెంకట్ రెడ్డి ,ఆంజనేయులు గౌడ్ రామలింగం, కళాశాల అధ్యాపకులు సత్య భాస్కర్ డాక్టర్ మనోహర్ ,గౌరీ ,జ్యోతి విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
