
అనుమాస్పల్లి గ్రామపంచాయతీలో కమ్యూనిటీ ప్లానిటేషన్, నర్సరీ పరిశీలన
గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి
ది లీడర్స్ డైరీ: అనుమాస్పల్లి గ్రామపంచాయతీ లో ఈరోజు అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమ్యూనిటీ ప్లానిటేషన్ కార్యక్రమం మరియు నర్సరీ కార్యకలాపాలపై విస్తృతంగా పరిశీలన చేశారు. గ్రామంలో సాగుతున్న పచ్చదన కార్యక్రమాలు, నర్సరీ మొక్కల పెంపకం విధానాలు, నిర్వహణ, సంరక్షణపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సర్పంచ్ నెనావత్ శ్రీనునాయడ్, గ్రామపంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్ మరియు సీనియర్ మేట్ పాల్గొని గ్రామాభివృద్ధి, హరితహారం కార్యక్రమాలపై చేపడుతున్న చర్యలను వివరించారు. గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ చేపడుతున్న ప్లానిటేషన్ కార్యక్రమాలు భవిష్యత్ తరాల కోసం మేలుకొలుపు చర్యలని అదనపు కార్యక్రమాధికారి అభినందించారు. గ్రామంలోని నర్సరీ ద్వారా స్థానికంగా మొక్కల లభ్యత పెరగడంతో పాటు పచ్చదనం విస్తరణకు పెద్ద సాయం జరుగుతుందని అధికారులు తెలిపారు. గ్రామస్థులను కూడా చెట్ల పెంపకం, సంరక్షణలో భాగస్వామ్యం కావాలని కోరారు.
