
గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతున్నా
ది లీడర్స్ డైరీ:గ్రామ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆశీస్సులు సహకారంతో నెరవేర్చే ప్రక్రియను చేపట్టామని అందులో భాగంగానే మల్లన్న గుడి వద్ద నుంచి గ్రామం వరకు సిసి రోడ్డు పనులను ప్రారంభించామని ఈసంపేట్ సర్పంచ్ దార వేణి సాయికుమార్ అన్నారు సోమవారం సిసి రోడ్డు ప్రారంభించి మాట్లాడారు మల్లన్న గుడికి వెళ్లాలంటే రహదారి సక్రమంగా లేకపోవడంతో భక్తులు ఇబ్బంది పడేవారని అందుకే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టామని సర్పంచ్ దారవేని సాయికుమార్ అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పోచన్న తో పాటు పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
