ది లీదర్స్ డైరీ: తెలంగాణ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది.15వ ఆర్థిక సంఘం నిధుల కోటాలో మూడో విడత నిధులు విడుదల చేసింది.
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. తాజాగా 15వ ఆర్థిక సంఘం కింద మూడవ విడతలో భాగంగా రూ. 387.57 కోట్లు విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 259.36 కోట్లు విడుదల కాగా రెండో విడత 387 కోట్లు విడుదల చేసింది. తాజాగా మూడో విడత నిధులు రిలీజ్ చేయడంతో దీంతో ఇప్పటివరకు 1034.42 కోట్లు విడుదలయ్యాయి. కేంద్రి నుంచి దశలవారీగా విడుదలైన నిధుల్లో నుంచి తెలంగాణ ఆర్థిక శాఖ గత మంగళవారం గ్రామపంచాయతీలకు రూ.256 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు రెండేళ్ల పాటు తెలంగాణ గ్రామ పంచాయతి ఎన్నికల ఆలస్యం కావడంతో 15 ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు ఆగిపోయాయి.
ఇంకా పెండింగ్లో రూ.2000 కోట్లు
గత ఏడాది డిసెంబర్లో రాష్ట్రంలోని పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరడంతో కేంద్రం నుంచి నిధులు విడుదలవుతుండగా వాటిని క్రమంగా రాష్ట్రం పంచాయతీలకు రిలీజ్ చేస్తోంది. కాగా తెలంగాణకు కేంద్రం ఇంకా 2000 కోట్లు బాకీ ఉంది. గ్రామాల అభివృద్ధి కోసం పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి విజ్ఞప్తి చేశారు. ఇప్పటివరకు కేంద్రం విడుదల చేసిన నిధులను గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు వెచ్చించాలని ఆదేశించారు.
